: కాస్త ఓపిక పట్టిండి... మీ డిమాండ్ల ఫైళ్లను రెండు ప్రభుత్వాలకు పంపుతాం: మహంతి


విద్యుత్ ఉద్యోగులతో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ మహంతి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ, విద్యుత్ ఉద్యోగులు కాస్త ఓపికపట్టాలని విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాలు త్వరలోనే ఏర్పడుతున్నాయని, అప్పుడు విద్యుత్ ఉద్యోగుల డిమాండ్ల ఫైళ్లను రెండు ప్రభుత్వాల దగ్గరకు పంపుతామని అన్నారు. ఏప్రిల్ నుంచి ఎరియర్స్ అందుతాయని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మె సరి కాదని హితవు పలికిన ఆయన, సమ్మె వల్ల ఆసుపత్రులు, రైల్వేలు, తాగునీటి సరఫరా, ఇతర పరిశ్రమలు ఇబ్బందుల్లో పడతాయని అన్నారు. పే రివిజన్ పేరిట 1250 కోట్ల రూపాయల అదనపు భారం ప్రభుత్వాలపై పడుతుందని ఆయన ఉద్యోగులకు వివరించారు. అయినప్పటికీ, ఉద్యోగులు శాంతించకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News