: గుండెకు మేలు చేయడంలో పరుగు, నడక రెండూ ఒకటే!
ఆరోగ్యం కోసం ప్రతి ఉదయం పరుగులు తీస్తూ.. వ్యాయామం పేరిట శ్రమపడుతున్నారా... అయితే మీరు కొంత నెమ్మదించవచ్చు. మీరు నిలకడగా నడకను అలవాటు చేసుకున్నా కూడా సరిపోతుంది. బీపీ, కొవ్వు వంటి గుండె ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను నియంత్రించడంలో పరుగు చేసే మేలును నడక వ్యాయామం కూడా చేస్తుందని అమెరికాలో 50 వేల మందిపై చేసిన ఓ అధ్యయనం నిగ్గు తేల్చింది.
వ్యాయామం అంటే బెదిరిపోయే వారు కూడా.. ఇక కేవలం పరుగు లేదా నడక ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు , అని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ పాల్ టి.విలియమ్స్ అంటున్నారు. కాలిఫోర్నియాలోని లారెన్స్ బెర్కిలీ జాతీయ ప్రయోగశాలలో ఆయన శాస్త్రవేత్త.
పరుగెత్తేవాళ్లలో డయాబెటీస్ రాకుండా ఉండడానికి 12.1 శాతం అవకాశం ఉంటే.. నడిచేవారిలో అది 12.3 శాతంగా ఉన్నదట. నడక అనేది.. గుండెజబ్బుల ప్రమాదాన్ని 9 శాతం మేర తగ్గిస్తోంటే.. పరుగెత్తేవాళ్లలో 4.5 శాతం మాత్రమే తగ్గుతుందిట.