: గూడ్స్ రైలును ఢీకొన్న గోరఖ్ ధామ్ ఎక్స్ ప్రెస్... 20 మంది మృతి
ఉత్తరప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి గోరఖ్ పూర్ వెళుతున్న గోరఖ్ ధామ్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పి గూడ్స్ రైలును ఢీకొనడంతో నాలుగు భోగీలు పట్టాలు తప్పాయి. 20మందికి పైగా చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. 50 మందికి గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు.