: యూసుఫ్ పఠాన్ స్పూర్తితో చెలరేగుతున్న ఆటగాళ్లు


ఐపీఎల్ 7 చివరి అంకానికి చేరుకుంటోంది. చివరి అంచెకు చేరుకుంటున్న కొద్దీ క్రికెట్ మరింత రంజుగా సాగుతోంది. ప్లే ఆఫ్ కు చేరుతున్న కొద్దీ ఒక్కోమ్యాచ్ ఒక్కోలా ఉత్కంఠ రేపుతూ అభిమానులకు పసందైన క్రీడా విందును అందిస్తోంది. కోల్ కతాకు కీలకమైన దశలో ఫాంలోకి వచ్చి చెలరేగి ఆ జట్టును నెంబర్ 2 స్థాయిలో నిలబెట్టిన యూసుఫ్ పఠాన్ స్పూర్తిగా క్రీడాకారులు చెలరేగుతున్నారు. అభిమానులకు భారీ ఇన్నింగ్స్ బాకీ పడిన కోహ్లీ చెలరేగినప్పటికీ సెహ్వాగ్, వోహ్రా కారణంగా తన జట్టును ప్లేఆఫ్ కు చేర్చలేకపోయాడు.

ఇక ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో సంజు శాంసన్ 74 పరుగులతో చెలరేగాడు. అయితే కోరే అండర్సన్ (95), అంబటి తిరుపతి రాయుడు (30) చెలరేగి కేవలం 14.4 ఓవర్లలోనే 195 పరుగులు చేయడంతో ముంబై ప్లే ఆఫ్ కు చేరుకుంది. తాజా ఐపీఎల్ విదేశీ ఆటగాళ్ల విన్యాసాలతోనే రక్తి కట్టింది. ఐపీఎల్ లో ప్రతిష్ఠాత్మకమైన ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ కోసం విదేశీయులు పోటీ పడ్డారు. దీంతో ఈ సారి అంతా విదేశీయులమయం అని భారత క్రికెట్ అభిమానుల్లో ఎక్కడో అసంతృప్తి ఉండేది.

ఆ అసంతృప్తిని దూరం చేస్తూ భారత క్రికెట్ పై యువనిక కొత్త ఆశలు కల్పిస్తోంది. అత్యుత్తమ బ్యాట్స్ మన్ గా ఊతప్ప దూసుకువచ్చి ఆరెంజ్ క్యాప్ దక్కించుకోగా, పర్పుల్ క్యాప్ కోసం భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ, ప్రవీణ్ తంబే పోటీ పడుతున్నారు. దీంతో అభిమానుల్లో, క్రీడా పండితుల్లో భారత క్రికెట్ భవిష్యత్తుపై నమ్మకం ఏర్పర్చుకుంటున్నారు.

  • Loading...

More Telugu News