: కి.మీ. దూరంనుంచే 3డి ఫోటోలు తీయొచ్చు


కిలోమీటరు దూరంనుంచే అద్భుతమైన రిజల్యూషన్‌తో హెచ్‌డీ 3డి ఇమేజిలను చిత్రించే లేజర్‌ కెమెరా పరిజ్ఞానాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. మామూలు కెమెరా ఫ్లాట్‌ 2డి చిత్రాలను మాత్రమే తీస్తుంది. 3డి సమాచారం కోసం ఒక లేజర్‌ కిరణాన్ని ప్రయోగించి, ఎంత దూరంలో ఆబ్జెక్ట్‌ ఉన్నదని పసిగట్టేలా ఈ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. పరిశోధకులు తమ ఆవిష్కరణ గురించి ఆప్టిక్స్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలో ప్రచురించారు.

ఈ సాంకేతికతను టైం ఆఫ్‌ ఫ్లైట్‌ ఇమేజింగ్‌ వ్యవస్థ అని పిలుస్తారు. ఎడిన్‌బర్గ్‌లోని హెరాయిట్‌ వాట్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ గెరాల్డ్‌ బుల్లర్‌ కిలోమీటరు దూరంనుంచి 3డి ఇమేజిలను తీయడం చాలా క్లిష్టమైన పని అని పేర్కొంటున్నారు. ఇన్‌ఫ్రారెడ్‌ లేజర్‌ కిరణాన్ని ఆబ్జెక్ట్‌ మీదకు వేయడం ద్వారా ఈ పద్ధతిలో ఇమేజిని చిత్రిస్తారు.

  • Loading...

More Telugu News