: ఖరారైన మోడీ కేబినెట్... రాష్ట్రం నుంచి ముగ్గురుకి కేబినెట్ పదవులు
నరేంద్ర మోడీ కేబినెట్ ఖరారయింది. తన మంత్రివర్గ జాబితాను భారత రాష్ట్రపతి ప్రణబ్ కు మోడీ పంపించారు. మంత్రి వర్గంలో 18 కేబినెట్, 16 మంది సహాయ మంత్రులు ఉన్నారు. మన రాష్ట్రం విషయానికొస్తే... ముగ్గురికి కేబినెట్ హోదా దక్కింది. వెంకయ్య నాయుడు, అశోక్ గజపతిరాజు, బండారు దత్తాత్రేయలకు కేబినెట్ లో చోటు దక్కింది. ఈ రోజు మోడీతో పాటు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు.