: మోడీ ప్రమాణ స్వీకారానికి రజనీ దూరం
నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరు కావడం లేదని తెలుస్తోంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలంటూ మోడీ నుంచి ఆహ్వానం అందినప్పటికీ... ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే హాజరవుతుండటంతో... తమిళనాడులో దుమారం చెలరేగుతోంది. దీంతో, కార్యక్రమానికి హాజరుకాకపోవడమే మంచిదని రజనీ భావిస్తున్నారు.