: రేపు రాజ్ ఘాట్ సందర్శించనున్న నరేంద్ర మోడీ
సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి, దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న మోడీ రేపు రాజ్ ఘాట్ ను సందర్శించనున్నారు. ఉదయం 7.30 గంటలకు జాతిపితకు నివాళి అర్పించనున్నారు. రాజ్ ఘాట్ ను సందర్శించే సమయంలో ఆయనకు ప్రధాని స్థాయి భద్రతను ఏర్పాటు చేస్తారు. రేపు సాయంత్రం 6 గంటలకు నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఏడు వేల మందితో భద్రత ఏర్పాటు చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.