: కేసీఆర్ ప్రమాణ స్వీకారం... 2వ తేదీ ఉదయం 8.15 గంటలకు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలను చేపట్టనున్న కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారయింది. జూన్ 2వ తేదీ ఉదయం 8.15 గంటలకు రాజ్ భవన్ లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు కొంత మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.57 గంటలకు సచివాలయంలోని సమతా బ్లాక్ లో ఉన్న సీఎం ఛాంబర్ కు చేరుకుంటారు. వెంటనే కీలక ఫైళ్లపై సంతకాలు పెడతారు. సీఎంగా తన తొలి సంతకం అమరవీరుల కుటుంబాలకు అందజేసే ఎక్స్ గ్రేషియా ఫైలుపై చేస్తారు. లక్షలోపు వ్యవసాయ రుణాల మాఫీ ఫైలుపై రెండో సంతకం చేస్తారు. వీటితో పాటు మరో 8 కీలక అంశాలకు చెందిన ఫైళ్లపై సంతకం చేయనున్నారు.