: అవినీతి అంతమే టీఆర్ఎస్ లక్ష్యం: కేటీఆర్


రాజకీయాల్లో నెలకొన్న అవినీతిని అంతం చేయడమే టీఆర్ఎస్ లక్ష్యమని ఆ పార్టీ నేత కేటీఆర్ అన్నారు. స్వపరిపాలన వచ్చింది... సుపరిపాలన అందిస్తామని చెప్పారు. ఈ రోజు హైదరాబాదులో తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు కింది స్థాయి వరకు వెళ్లడానికి ఉద్యోగుల సహకారం అవసరమని చెప్పారు. ప్రతి పేదవాడికి అభివృద్ధి ఫలాలు అందినప్పుడే తెలంగాణ ఉద్యమ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News