: సౌదీలో భారతీయుడి కాల్చివేత


కారు డ్రైవర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తిని అతని యజమాని కుమారుడు కాల్చిచంపేశాడు. ఈ ఘటన సౌదీఅరేబియాలోని మక్కాలో జరిగింది. కేరళకు చెందిన పుదవ్విలికల్వీ అనే 24 ఏళ్ల యువకుడు వారం రోజుల కిందటే డ్రైవర్ గా ఉద్యోగంలో చేరాడు. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది. యజమాని కుమారుడే కాల్చి చంపినట్టు మక్కా పోలీస్ అధికారి ఖురేషీ తెలిపారు. అయితే, ఈ హత్యకు గల కారణాలు ఇంతవరకు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News