: కేంద్ర మంత్రి పదవికి అశోక్ ను ఖరారు చేసిన టీడీపీ


ప్రస్తుతానికి ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నింటికీ బీజేపీ ఒక్కొక్క కేబినెట్ మంత్రి చొప్పున కేటాయించింది. ఈ క్రమంలో టీడీపీకి కూడా ఒక్క కేబినెట్ బెర్త్ దొరికింది. దీనిపై పార్టీ సీనియర్లతో చర్చించిన చంద్రబాబు కేబినెట్ పదవికి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును ఎంపిక చేశారు. దీంతో, రేపు మోడీ కేబినెట్ లో మంత్రిగా అశోక్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతేకాకుండా, టీడీపీకి రెండు సహాయ మంత్రి పదవులను ఆఫర్ చేసినట్టు సమాచారం. దీంతో, ఈ పదవుల్లో ఒక దాన్ని కమ్మ, మరోదాన్ని రెడ్డి సామాజిక వర్గాలకు కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించినట్టు సమాచారం. మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా గెలుపొందిన మల్లారెడ్డి సహాయ మంత్రి రేసులో ఉన్నారు. అదేవిధంగా, సీమాంధ్ర ప్రాంతం నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన సుజనా చౌదరి, గరికపాటి మోహన్ రావుల్లో ఒకరికి సహాయ మంత్రి దక్కే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News