: టీడీపీ నైతిక విలువలు కోల్పోయింది: మైసూరా


తమ పార్టీ ఎంపీలు టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఒక్కసారిగా వైకాపా ఉలిక్కిపడింది. టీడీపీ నైతిక విలువలు కోల్పోయి వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేత మైసూరా రెడ్డి విమర్శించారు. మరో పార్టీ నుంచి గెలుపొందిన వారిని టీడీపీ ఎలా చేర్చుకుంటుందని ప్రశ్నించారు. ఒకరిద్దరు పోయినంత మాత్రాన నష్టం లేదని... ఇకపై ఎవరూ వైకాపాను వీడరని చెప్పారు. తమ పార్టీ విప్ చెల్లుబాటు అవుతుందని... పార్టీని వీడే వారందరికీ విప్ వర్తిస్తుందని తెలిపారు. కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News