: సమ్మె కొనసాగుతుంది: ఏపీ విద్యుత్ జేఏసీ
పీఆర్సీ అమలయ్యేవరకు తమ సమ్మె కొనసాగుతుందని ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ స్పష్టం చేసింది. ప్రజల ఇబ్బందులతో తమకు సంబంధం లేదని... యాజమాన్యమే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది. ఇప్పటికే చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయే పరిస్థితి నెలకొందని వెల్లడించింది. న్యాయబద్ధమైన తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసింది.