: విద్యుత్ ఉద్యోగులకు చంద్రబాబు లేఖ
సమ్మెకు దిగిన విద్యుత్ ఉద్యోగులకు కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. సమ్మెవల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని... ఆసుపత్రులకు విద్యుత్ లేకపోతే పేషెంట్ల పరిస్థితి దారుణంగా తయారవుతుందని లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీడీపీ కట్టుబడి ఉందని తెలిపారు. వెంటనే సమ్మెను విరమించి, విధుల్లో చేరాలని సూచించారు.