: ఎస్పీవై రెడ్డి చేరడం శుభ సూచకం: సీఎం రమేశ్


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరడం శుభసూచకమని ఆ పార్టీ ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. సీమాంధ్రలో అభివృద్ధి టీడీపీ, ఎన్డీయే ప్రభుత్వాలతోనే సాధ్యమని నమ్మి ఆయన చంద్రబాబును కలుసుకుని పార్టీలో చేరారని తెలిపారు. ఇంకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది టీడీపీలో చేరాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అందరినీ కాకుండా, రాష్ట్రాభివృద్ధి కోసం, పార్టీ అభివృద్ధి కోసం పాటుపడతారని అనుకున్న మంచి వ్యక్తులనే టీడీపీలోకి చేర్చుకోనున్నామని వెల్లడించారు. అలాంటి వారి విషయంలో టీడీపీ మహానాడు తర్వాత చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

  • Loading...

More Telugu News