: 'మా' నూతన కార్యవర్గ ప్రమాణం


టాలీవుడ్ లో గుర్తింపు పొందిన నటీనటుల సంఘం 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' నూతన కార్యవర్గం నేడు ప్రమాణ స్వీకారం చేసింది. కాగా, రెండేళ్ళకోమారు జరిగే 'మా' ఎన్నికల్లో సీనియర్ నటుడు మురళీ మోహన్ వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈ సందర్భంగా ఫిల్మ్ చాంబర్ లో సమావేశం ఏర్పాటు చేశారు.

మురళీ మోహన్ మాట్లాడుతూ, తనపట్ల మరోసారి నమ్మకముంచిన సినీ కళాకారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అక్కినేని నాగేశ్వరరావు నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణం చేయించారు. అనంతరం అక్కినేని మాట్లాడుతూ, సినీ నటుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని 'మా'కు సూచించారు.

  • Loading...

More Telugu News