: తెలుగు తేజాల ఎవరెస్ట్ అధిరోహణ
రాష్ట్రానికి చెందిన గురుకుల విద్యాలయాల విద్యార్థులు ఇద్దరు ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించారు. నిజామాబాద్ జిల్లా తాడ్వాయి గురుకుల విద్యాలయానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని పూర్ణ(14), ఖమ్మం జిల్లాకు చెందిన గురుకుల విద్యాలయం విద్యార్థి ఆనంద్(17) ఈ ఉదయం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. భారత పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారు. ప్రపంచంలో అతి చిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బాలికగా పూర్ణ రికార్డు నమోదు చేసింది. గురుకుల విద్యాలయాల సొసైటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ ప్రోత్సాహంతో వీరు ఈ లక్ష్యాన్ని పూర్తి చేశారు.