: బాద్ షా సినిమా.. మధ్యలో బాంబు స్క్వాడ్!


'బాంబు కలకలం' ఇంకా హైదరాబాద్ నగరాన్ని వీడినట్టు లేదు. ఈ రోజు విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ 'బాద్ షా' చిత్రాన్ని ప్రదర్శిస్తున్న అంబర్ పేటలోని శ్రీరమణ థియేటర్ కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో, యాజమాన్యం వెంటనే స్పందించి సినిమాను నిలిపివేసి, పోలీసులకు సమాచారం అందించింది. దీంతో హుటాహుటీన అక్కడికి చేరుకున్న బాంబు స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు.

  • Loading...

More Telugu News