: నేడు ఢిల్లీకి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్


తెలంగాణ రాష్ట్రసమితి అధినేత, తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు. నరేంద్ర మోడీ రేపు సాయంత్రం 6 గంటలకు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కేసీఆర్ తో పాటు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన పదిమంది టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఢిల్లీ వెళ్తారు. ఆయన తిరిగి ఎల్లుండి (మంగళవారం) హైదరాబాద్ చేరుకుంటారు.

  • Loading...

More Telugu News