: పెళ్లి మండపంపై తెగిపడిన విద్యుత్ తీగలు ... ఆగిపోయిన పెళ్లి


పెళ్లి జరుగుతున్న సమయంలో మండపంపై విద్యుత్ తీగలు తెగిపడటంతో పెళ్లి ఆగిపోయింది. అనంతపురం జిల్లా ఆగిలి మండలం డొక్కంపల్లి లో ఈ రోజు ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో వధువు తల్లిదండ్రులతో పాటు మరో ఐదుగురు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం మడకశిర ఆసుపత్రికి తరలించారు. కాగా వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News