: ఐపీఎల్ లో 'లంక' వర్సెస్ 'లంక'
ఐపీఎల్ లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, పుణే వారియర్స్ ఇండియా జట్లు తమ తొలి మ్యాచ్ కు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ లో పోటీ పడుతున్న రెండు జట్లకు శ్రీలంక ఆటగాళ్ళే సారథులు కావడం విశేషం. సన్ రైజర్స్ కు లంక స్టార్ బ్యాట్స్ మన్ కుమార సంగక్కర సారథ్యం వహిస్తుండగా.. పుణే జట్టుకు ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ నాయకత్వం చేపట్టాడు. కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పుణే ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ పోరుకు హైదరాబాద్ లోని ఉప్పల్ క్రికెట్ మైదానం వేదిక. మ్యాచ్ మరికాసేపట్లో మొదలవనుంది.