: 'బాద్ షా' థియేటర్ వద్ద తొక్కిసలాట.. అభిమాని మృతి
కొద్దిరోజుల క్రితం బాద్ షా ఆడియో రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుని జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఒకరు మరణించిన సంగతి మరువక ముందే అలాంటి ఘటనే మరోటి జరిగింది. 'బాద్ షా' నేడు విడుదలైన సందర్భంగా కర్నూల్ జిల్లా డోన్ వద్ద శేషు థియేటర్ లో తొక్కిసలాట జరగడంతో ఓ అభిమాని ప్రాణాలు విడిచాడు.