: కేసీఆర్ కి ముందుంది మొసళ్ల పండగ: దానం


ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని మాజీ మంత్రి దానం నాగేందర్ హెచ్చరించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందుంది మొసళ్ల పండగ అని అన్నారు. సెటిలర్స్ ను వెళ్లగొడతానని అనడం సరికాదని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీలో క్యాడర్ తక్కువ, లీడర్లు ఎక్కువగా ఉన్నందువల్ల సెటిలర్స్ తమ పార్టీని నమ్మలేదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News