: పద్మభూషణ్ కు 'నో' చెప్పిన జానకి
ప్రముఖ దక్షిణాది గాయని ఎస్.జానకి 'పద్మభూషణ్' అవార్డును తిరస్కరించారు. తాను గత 55 ఏళ్ళుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నానని, వివిధ భాషల్లో 20 వేలకుపైగా పాటలు పాడానని.. అందువల్ల తనకు 'భారతరత్న' ఇస్తే బాగుండేదని జానకి అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినా తనకు అవార్డులు అక్కరలేదని, అభిమానుల ఆదరణ చాలని చెప్పారు. కేంద్రం ఈరోజు పలువురు ప్రముఖులకు 'పద్మ' అవార్డులు బహుకరించిన సంగతి తెలిసిందే.