: వాతావరణం అనుకూలించకపోవడంతో కేదార్ నాథ్ యాత్రకు బ్రేక్
కేదార్ నాథ్ యాత్ర ఇవాళ నిలిచిపోయింది. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడి రోడ్డు మార్గం మూసుకుపోయిందని, దాంతో యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. ఎడతెగని వర్షం కారణంగా టిల్వాడ నుంచి గుప్తకాశీ వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడినట్లు వారు వెల్లడించారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడినట్లు తమకు వార్తలు అందలేదని వారు చెప్పారు. వాతావరణం అనుకూలించేంత వరకు తిరిగి యాత్రను కొనసాగించేందుకు వీలు లేదని కూడా వారు తెలిపారు. పది రోజుల క్రితం కూడా వాతావరణ పరిస్థితుల వల్ల కేదార్ నాథ్ యాత్రకు అంతరాయం కలిగిన విషయం విదితమే.