: వైట్ హౌస్ ఎదురుగా బట్టలిప్పేశాడు
అమెరికాలో ఎండలు మండిపోతున్నాయి... గత కొన్ని రోజులుగా అక్కడ 26 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో ఎండలకు తాళలేక అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ కు పరిశోధకులంతా అమెరికానే తప్పుపడుతున్నారు. దీంతో ఒళ్లు మండిన ఓ అమెరికన్ సాక్షాత్తూ అమెరికా అధ్యక్షభవనం శ్వేతసౌధం ముందు నగ్నంగా నిరసన తెలిపాడు. అమెరికాకు గృహ నిర్మాణ శాఖ కార్యదర్శిని అధ్యక్షుడు ఒబామా ప్రకటించేందుకు కొద్ది సేపటి ముందు ఈ ఘటన చోటు చేసుకుంది.
మిషెల్ బెచర్డ్ అనే వ్యక్తి వైట్ హౌస్ ముందుకు వెళ్లాడు. గేటు ఎదురుగా నిల్చుని ఒక్కో వస్త్రాన్ని విప్పేశాడు. దీంతో షాక్ తిన్న అధికారులు తేరుకుని అతనిపై ఫాయిల్ షీట్ కప్పి అక్కడ్నుంచి వ్యాన్ లో తరలించారు. దీనిని కొంత మంది సెల్ ఫోన్లో చిత్రీకరించడంతో విషయం వెలుగు చూసింది.