: మోడీతో వెంకయ్యనాయుడు సుదీర్ఘ భేటీ
కాబోయే ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు సమావేశమైన వీరు, మంత్రివర్గ కూర్పుపై చర్చించినట్టు సమాచారం. కేంద్ర కేబినెట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఇవ్వాల్సిన గుర్తింపుపై వీరు చర్చించారు. వెంకయ్యనాయుడు నుంచి మోడీ పలు సూచనలు తీసుకున్నారు.