: ఆస్పత్రిలో చేరిన శత్రుఘ్న సిన్హా
బీజేపీ నేత, బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్లో ఈ రోజు చేరారు. గతేడాది ఇదే హాస్పిటల్లో ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. సాధారణ వైద్య పరీక్షల కోసమే వచ్చినట్లు ఆయన కుమారుడు లవ్ సిన్హా తెలిపారు. పరీక్షలు పూర్తయ్యాక వైద్యులే వివరాలు వెల్లడిస్తారని ఆయన అన్నారు.