: మోడీ మంచి మనసు... రూ.21 లక్షల విరాళం
గుజరాత్ సీఎం పదవి నుంచి దిగిపోయిన నరేంద్రమోడీ ఆ రాష్ట్రంలో ప్రభుత్వ డ్రైవర్లు, ప్యూన్ల కోసం కాస్త పెద్ద మనసు చేసుకున్నారు. వారి కుమార్తెల విద్యాభ్యాసం కోసం తాను దాచుకున్న సొమ్ములోంచి 21 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్, చీఫ్ సెక్రటరీ పర్యవేక్షణ కింద ఉంచి ఖర్చు చేయనున్నారు.