: ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం: కవిత
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని టీఆర్ఎస్ ఎంపీ కవిత తెలిపారు. నిజామాబాద్ లోని బాల్కొండలో ఆమె మాట్లాడుతూ, టీఆర్ఎస్ కు అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రజల రుణం తీర్చుకోలేనిదని అన్నారు. పైరవీలకు తావులేకుండా పారదర్శక పాలన అందిస్తామని కవిత తెలిపారు. పట్టంకట్టిన ప్రజలను గుండెల్లో పెట్టి చూసుకుంటామని ఆమె చెప్పారు.