: పాక్ లో బాంబు పేలుడు... నలుగురు అధికారుల మృతి
పాకిస్థాన్ మరోసారి నెత్తురోడింది. అయితే ఈసారి సాయుధ బలగాలను టార్గెట్ చేశారు ఉగ్రవాదులు. తాలిబన్ల ప్రాబల్యం ఉండే గిరిజన ప్రాంతంలో ఈ రోజు సైనికుల వాహన శ్రేణి వెళుతుండగా... రోడ్డు పక్కన అమర్చిన బాంబు పేలింది. ఈ ఘటనలో నలుగురు సైనికాధికారులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.