: ఇల్లు నరకం... ఆఫీసే పదిలం


గతంలో పొద్దస్తమానం ఇంట్లో గడిపేవాడిని కుటుంబరావు అనేవారు... కానీ, కాలం మారుతోంది. అభిరుచులు, అలవాట్లు మారుతున్నాయి. రానురాను ఇల్లు నరకంలా తయారువుతోందని పరిశోధనలు చెబుతున్నాయి. అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీలోని కార్మిక ఉపాధి విభాగ అధ్యాపకురాలు సారా డెమాస్క్ నిర్వహించిన పరిశోధనలో ఆడ, మగ అనే లింగబేధం లేకుండా చాలా మంది ఇంట్లోనే ఎక్కువ శ్రమపడుతున్నారని తేలింది. వీరంతా ఆఫీసుల్లోనే రిలాక్సవుతున్నారట.

వీకెండ్స్ లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుందట. అందుకే వీరంతా వారాంతాల్లో కూడా ఆఫీస్ ఉంటే బావుణ్ణు అని తెగఫీలైపోతుంటారు. పిల్లల్ని రెడీ చేయడం, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు సమకూర్చుకోవడం, ఇంట్లో వారి కోరికలు తీర్చడం వంటి పనులతో చాలామంది ఇళ్లలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని ఆమె పరిశోధన తేల్చింది. అలాంటి వారంతా ఆఫీసులో రిలాక్సవుతున్నారని ఆమె పరిశోధనలో వెల్లడైంది.

  • Loading...

More Telugu News