: తాలిబాన్లు మెచ్చిన క్రీడ ఏమిటో తెలుసా..?


మతం తర్వాతే వారికి ఏదైనా. ఆ మత్తులో ఏం చేయడానికైనా వెనుకాడరు వాళ్ళు. అణువణువు ఛాందసవాదాన్ని పుణికి పుచ్చుకున్న ఆ నరరూప రాక్షసులు చిన్నారుల నుంచి వయోవృద్ధుల దాకా ఎవరి ప్రాణాలనైనా కిరాతకంగా హరించేస్తారు. ఇంతకంటే తక్కువగా తాలిబాన్ల గురించి చెప్పలేం. ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వాలు ఎన్ని మారినా తాలిబాన్ల వైఖరిలో మార్పుండదు. అంతటి కరకు హృదయాలను కదిలించిన క్రీడ ఏమిటో తెలుసా.. క్రికెట్!

ఈ జనరంజక క్రీడ పుణ్యమాని ఆఫ్ఘాన్ లో పలువురు యువకులు ధైర్యంగా మైదానాల్లోకి వెళ్ళగలుగుతున్నారు. దేశంలో ఏ క్రీడనూ ప్రోత్సహించిన దాఖలాల్లేని తాలిబాన్లు క్రికెట్ ను ఇష్టపడడం నిజంగా వైచిత్రే. ప్రస్తుతం ఆఫ్ఘాన్ టీమ్ ఆసియా స్థాయిలో ఉనికిని చాటుకుంటోంది. వీరిని చూసి పలువురు చిన్నారులు క్రికెట్ బ్యాట్లతో మైదానాల్లోకి పరుగులు పెడుతున్నారట.

పలు విషయాలపై ఆంక్షలు విధించే తాలిబాన్లు ఒక్క క్రికెట్ విషయంలో మాత్రం ఉదారంగా వ్యవహరించడంతో అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆఫ్ఘాన్ జాతీయ క్రీడా సంఘం చీఫ్ ఎగ్జిక్యూటివ్ నూర్ మహ్మద్ ఏమంటున్నారో వినండి. 'దేశాన్నంతటిని ఒక్కతాటి మీదకు తెచ్చిన ఘనత నిస్సందేహంగా క్రికెట్ దే. శాంతి, స్థిరత్వం సాధనకు క్రికెట్ ఓ గొప్ప ఉపకరణం' అని కొనియాడాడు.

  • Loading...

More Telugu News