: ఆమే నా భర్త అంటున్న మహిళ!
స్త్రీ, పురుషులు పెళ్లాడడం ప్రకృతి ధర్మం. కానీ, దానికి విరుద్దంగా ఓ ఇద్దరు యువతులు.... ఒకరికొకరు ఏం నచ్చారో గానీ, పెళ్లితో తమ బంధాన్ని వారు బలంగా పెనవేసుకున్నారు. ఈ వింత మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జరిగింది. సాత్నాలో నివసించే 24 ఏళ్ల నికితా అసాని కొన్ని రోజుల క్రితం అదృశ్యమైంది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 22న పోలీసులు జబల్ పూర్ లో ఓ మహిళను గుర్తించారు. నికితేమోనన్న అనుమానంతో తల్లిదండ్రులకు కబురు పెట్టారు. వారొచ్చి ఆమె తమ సుపుత్రికే అని తేల్చారు.
అయితే, తాను మాత్రం తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లబోనని నికిత తేల్చి చెప్పింది. ఎందుకమ్మా? అని పోలీసులు అడిగి చూశారు. తాను తన స్నేహితురాలు రజనీరాజ్ ను పెళ్లి చేసుకున్నానని, ఆమెను తన భర్తగా భావిస్తున్నానని, ఆమెతోనే కలసి ఉంటానని కుండబద్దలు కొట్టింది. అంతేకాదు తనకు మంచేదో, చెడేదో తెలుసంటూ పోలీసుల నోటికి తాళం వేసింది. కొసమెరుపు ఏమిటంటే, నికిత పెళ్లాడిన రజనీపై పలు కేసులున్నాయట. అమ్మాయిలను బుట్టలో వేయడం ఆ మాయలాడికి వెన్నతో పెట్టిన విద్య అని పోలీసు వర్గాలు తెలిపాయి.