: ఆంధ్రప్రదేశ్ సీఎస్ గా ఐ.వై.ఆర్.కృష్ణారావు ... డీజీపీగా జె.వి.రాముడు
ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం అపాయింటెడ్ డే దగ్గర పడుతుండడంతో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనకు సంబంధించిన వ్యవహారాలపై దృష్టి పెట్టారు. తన వేగాన్ని అందుకునే సమర్థవంతమైన, నిజాయతీ అధికారుల కోసం కసరత్తు చేసి కొంతమందిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా (చీఫ్ సెక్రటరీ) సీనియర్ ఐఏఎస్ అధికారి ఐ.వై.అర్.కృష్ణారావును ఎంచుకున్నట్టు సమాచారం.
అలాగే నూతన డీజీపీగా జె.వి.రాముడును ఎంపిక చేశారు. ప్రస్తుత డీజీపీ ప్రసాదరావును హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించనున్నారు. ఇక సీ.ఎం. పేషీలో కీలక పదవి ముఖ్యమంత్రి పీ.ఎస్.గా అజయ్ సహానీ రానున్నారు. అక్కడే కార్యదర్శులుగా గిరిధర్, సాయిప్రసాద్ లను చంద్రబాబు ఎంచుకున్నారు. అలాగే, అదనపు డీజీ (ఇంటెలిజెన్స్) ద్వారకా తిరుమలరావు ఎంపికయ్యారు.