: పళ్లు పీకబోయి ప్రాణం తీసేసిన వైద్యుడు
ఓ వైద్యుడి నిర్లక్ష్యం రోగిపాలిట శాపంగా మారింది. అమెరికాలోని న్యూయార్క్ లో 64 ఏళ్ల జుదిత్ గాన్ అనే మహిళ తినేందుకు పళ్లు సహకరించకపోవడంతో పెట్టుడుపళ్లు పెట్టించుకునేందుకు రష్మీ పటేల్ అనే భారత సంతతి డాక్టర్ వద్దకు వెళ్లింది. ఆమెను పరిశీలించిన రష్మీ పటేల్ సహాయకుడు వారిస్తున్నా వినకుండా, ఆమెకున్న 20 పళ్లను ఒకేసారి పీకేందుకు ప్రయత్నించాడు. దీంతో భయపడ్డ సహాయకుడు బయటికి పరుగెత్తి అంబులెన్సుకు ఫోన్ చేశాడు. అంబులెన్స్ వచ్చేసరికి జుదిత్ గాన్ స్పృహ తప్పిపడిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు ఆమె మృతి చెందినట్టు నిర్థారించారు. అయితే ఆమె తన వైద్యం వల్ల చనిపోలేదని రష్మీ పటేల్ చెబుతుండడం విశేషం.