: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం మా కూటమిదే: తీగల కృష్ణారెడ్డి


గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కలిసే పోటీ చేస్తుందని టీడీపీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేసినందుకు పవన్ కల్యాణ్ ను కలిసి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఎన్నికల్లో కూటమి పోటీ చేసే విషయంపై చంద్రబాబుదే తుది నిర్ణయమని అన్నారు. హైదరాబాదు జిల్లాలో టీడీపీ బలంగా ఉందని, బీజేపీ, జనసేన కలవడంతో మరింత బలోపేతం అవుతుందని తీగల అన్నారు.

  • Loading...

More Telugu News