: పొన్నాల, జైరాం వల్లే తెలంగాణలో ఓడిపోయాం: పాల్వాయి
టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కొప్పుల రాజు, జైరాం రమేష్ వల్లే తెలంగాణలో దారుణంగా ఓడిపోయామంటూ కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసిన ఆయన, దిగ్విజయ్, కేవీపీ వల్లే పొన్నాలకు పదవి దక్కిందన్నారు. అయితే, రెడ్డి సామాజిక వర్గానికి పొన్నాల ప్రాధాన్యం ఇవ్వలేదని లేఖలో విమర్శించారు. తెలంగాణలో గెలిచిన పదకొండు మందీ రెడ్డి వర్గానికి చెందిన వారేనని... కానీ, బీసీలనుంచి ఒక్కరూ గెలవలేదని చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేదన్న జైరాం, కొప్పుల వ్యాఖ్యల వల్లే తీవ్ర నష్టం జరిగి ఘోర ఒటమి పాలయ్యామని పేర్కొన్నారు.