: కాంగ్రెస్ బాటలో టీఆర్ఎస్
కాంగ్రెస్ పార్టీ బాటలో టీఆర్ఎస్ నడుస్తోందా? అంటే అన్ని విషయాల్లో ఏమో కానీ... ఓ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీయే ఆదర్శమని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భవన్ లో వార్ రూంను హరీష్ రావు ప్రారంభించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ వార్ రూం సంస్కృతి టీఆర్ఎస్ లోనూ ప్రవేశించిందని ఆ పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. వార్ రూంలో మొట్టమొదటగా విభజన సందర్భంగా ఏర్పడే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించనున్నారు.