: కూకట్ పల్లిలో వంట గ్యాస్ లీకై చెలరేగిన మంటలు
హైదరాబాదులోని కూకట్ పల్లిలో వంట గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఇవాళ ఉదయం బాగ్ అమీర్ లోని ఓ ఇంట్లో గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో... ఇంటిలోని సామాగ్రి మొత్తం తగులబడింది. ఈ ఘటనలో ఇంట్లోనే ఉన్న మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిప్రమాద సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.