: మోడీ ప్రధాని ఆకాంక్షపై రాజకీయ పార్టీల కలవరం!
తన సేవతో మాతృదేశం రుణం తీర్చుకుంటానన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తాజా వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. నిన్న ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన ప్రధాని పదవిపై పరోక్షంగా ఆకాంక్షను వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్, జేడీ (యు), సమాజ్ వాదీ పార్టీలు తమదైన శైలిలో స్పందించాయి. మోడీ చేస్తున్న ప్రకటనపై కలత చెందుతున్నానని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి మనీష్ తివారీ అన్నారు.
దేశానికి మోడీ ఎలాంటి సేవ చేయాలనుకుంటున్నారో అర్ధం కావడంలేదని జనతాదళ్ (యునైటెడ్) నేత శివానంద్ తివారీ అన్నారు. ఢిల్లీకి చేరుకోవాలని ప్రతి ఒక్కరికీ ఆశ ఉంటుందన్నారు. అయితే, ప్రధాని పీఠాన్ని అధిష్ఠించి ఎవరు దేశాన్ని నడపబోతారన్నది తాము చూస్తామని చెప్పారు. గుజరాత్ లో చేసింది తక్కువ, ప్రచారం ఎక్కువని ఎస్పీ నేత నరేష్ అగర్వాల్ విమర్శించారు. బీజేపీలో అటల్ బిహారీ వాజ్ పాయ్ కంటే మరో గొప్ప నేత లేరన్నారు. మోడీ... వాజ్ పాయ్ అంత గొప్పనేత ఏమీ కాదని వ్యాఖ్యానించారు. దేశ నాయకుడు ఎవరు కావాలో దేశ ప్రజలే నిర్ణయిస్తారన్నారు.
ఇదిలావుంటే రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత వసుంధర రాజే మాత్రం తన పొరుగు రాష్ట్ర సీఎం అయిన మోడీని ప్రశంసల్లో ముంచెత్తారు. ఆయన వల్ల జాతికి మంచే జరుగుతుందన్నారు.