: ఇళ్లు ఖాళీ చేయండి... లేకుంటే లక్షన్నర అద్దె చెల్లించాల్సి ఉంటుంది: లోక్ సభ పరాజితులకు తాఖీదు
తక్షణం ఇళ్లు ఖాళీ చేయాలంటూ ఇటీవలి ఎన్నికల్లో ఓడిన ఎంపీలకు పార్లమెంటు హౌసింగ్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. లోక్ సభను రాష్ట్రపతి రద్దు చేయడంతో పరాజిత ఎంపీలంతా నెలరోజుల్లో అధికారిక నివాసాలు ఖాళీ చేయాలంటూ ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే ఎంపీలకు కేటాయించిన ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యాలను తొలగించారు. ఖాళీ చేయకపోతే నెలకు లక్షన్నర అద్దెచెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.