: ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే భక్తులు హనుమాన్ మందిరాలకు క్యూ కట్టారు. రాష్ట్రంలోని ప్రసిద్ధ ఆలయమైన కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ లోని అభయాంజనేయ మందిరం భక్తులతో కిటకిటలాడుతోంది. పంచామృతాలతో అభిషేకించిన అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఇవాళ వేకువ జామున 3 గంటల నుంచే భక్తులు బారులు తీరారు. తెలంగాణలోని ప్రముఖ దేవాలయమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి హనుమాన్ దీక్షాధారులు భారీగా తరలివచ్చారు.