: మోడీ సోదరులు ఏం చేస్తుంటారు?
నరేంద్రమోడీకి ఒక అన్నయ్య, ఇద్దరు తమ్ముళ్లు. వారంతా సాధారణ జీవితం గడుపుతున్నవారే. అన్నయ్య సోమ గుజరాత్ ప్రభుత్వ వైద్య శాఖలో పని చేసి రిటైరయ్యారు. ప్రస్తుతం అహ్మదాబాద్ లో ఓ వృద్ధాశ్రమం నడుపుతున్నారు. మోడీ పెద్ద తమ్ముడు ప్రహ్లాద్ అహ్మదాబాద్ లో రేషన్ షాపు ఓనర్. చిన్న తమ్ముడు పంకజ్ గాంధీనగర్లో ఉంటారు. ఆయన గుజరాత్ ప్రభుత్వ సమాచార శాఖలో క్లర్క్ గా పనిచేస్తున్నారు. మోడీ తల్లి హీరాబెన్ పెద్ద కొడుకు సోమ దగ్గరే ఉంటున్నారు. ఇక మోడీ భార్య జశోదాబెన్ పదవీ విరమణ పొందిన ప్రభుత్వ టీచర్. బనస్కాంత జిల్లా రాజోసన గ్రామంలో నివసిస్తున్నారు.