: మోడీకి శుభాకాంక్షలు తెలుపుతూ సోనియా లేఖ!


లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి, దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకు (మోడీ) లేఖ రాసినట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం. ఈ మేరకు ఆ లేఖను బీజేపీ నేతకు పంపినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడయిన తర్వాత మీడియాతో మాట్లాడిన సోనియా, రాహుల్ మోడీకి అభినందనలు తెలపకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే లేఖ రాసినట్లు తెలుస్తోంది. అటు నరేంద్రమోడీకి ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలిపారని, ప్రతిపక్షం నుంచి కూడా అభినందనలు సహజమేనని బీజేపీ సీనియర్ నేత అనంతకుమార్ సోనియా లేఖపై స్పందిస్తూ అన్నారు.

  • Loading...

More Telugu News