: అసలు ఉద్యోగం సాఫ్ట్ వేర్ ఇంజనీర్... సైడు ఉద్యోగం చోరీలు


విలాసాలు ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను కటకటాల పాల్జేశాయి. బెంగళూరులోని గోవిందశెట్టి పాళ్యలో నివాసముండే ఎలిజిబెత్ అలియాస్ మేరీ(22) యాక్సెంచర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. ఇటీవల తన జల్సాల కోసం సైడు జాబ్ గా చోరీలు కూడా మొదలుపెట్టింది. హెణ్ణూరులోని తన స్నేహితురాలు పూజాశర్మ ఇంటికి వెళ్లడం, వారి నగలను గుట్టుచప్పుడు కాకుండా కొట్టుకురావడం చేస్తోంది. ఇంట్లో నగలు పోతుండడంపై పూజాశర్మ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారణలో భాగంగా పూజాశర్మ ఇంటికి వచ్చి పోయే వారిని పోలీసులు ప్రశ్నించారు. దాంతో మేరీ చోరీలు బయటపడ్డాయి. కొట్టుకొచ్చిన నగలను తాకట్టు పెట్టి ఆ డబ్బులతో తండ్రి అప్పులు తీర్చడంతోపాటు, విలాస వంతమైన జీవితానికి మేరీ ఖర్చు చేస్తున్నట్లు తేలింది. ఆమె దగ్గర నుంచి నాలుగున్నర లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News