: కేసీఆర్ ఎన్ని అవతారాలు ఎత్తినా రాష్ట్ర విభజన జరగదు: టీజీ వెంకటేష్


టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై మంత్రి టీజీ వెంకటేష్ ధ్వజమెత్తారు. ఆయన ఎన్ని అవతారాలు ఎత్తినా రాష్ట్ర విభజన జరిగేదేలేదని తేల్చి చెప్పారు. కుటుంబానికి పదవులు సంపాదించుకునే ఆలోచనతోనే రాష్ట్ర విభజన అంటూ కేసీఆర్ ఉద్యమాలు చేపట్టారని ఆరోపించారు. తన డిమాండ్లు సాధించుకునేందుకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆయన ఎన్నో అవతారాలు ఎత్తారని టీజీ విమర్శించారు. చివరి అవతారంగా నరసింహ అవతారం ఎత్తుతానంటున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి అవతారాలకు, బెదిరింపులకు భయపడేలేదని కర్నూలులో మీడియాతో ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News