: కేసీఆర్, కోదండరాంల మధ్య పెరుగుతున్న అంతరం


తెలంగాణ ఉద్యమంలో కలసికట్టుగా వ్యవహరించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీజేఏసీ ఛైర్మన్ కోదండరాంల మధ్య ఇప్పుడు అంతరం పెరుగుతోంది. ఎన్నికల్లో విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నప్పటికీ... కోదండరాం మాత్రం ఇంతవరకు ఆయన్ను అభినందించడానికి కూడా రాలేదు. దీనికి సంబంధించి, కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇంతవరకు దొరకలేదని ఓవైపు జేఏసీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు దీనిపై ఎలాంటి కామెంట్లు చేయకుండా... టీఆర్ఎస్ నేతలు వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్న సమయంలో కూడా... ఒకానొక సందర్భంలో జేఏసీని నిర్వీర్యం చేయడానికి కేసీఆర్ ప్రయత్నించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న తరుణంలో కోదండరాం ఆధిపత్యానికి తెరదించే ప్రయత్నాలను గులాబీ బాస్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News