: పార్లమెంటు భవనంలో అగ్నిప్రమాదం


మరో రెండు రోజుల్లో మోడీ ప్రమాణ స్వీకారం ఉందనగా, ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఉదయం పార్లమెంటు భవనంలోని మూడో అంతస్తులో స్వల్పంగా మంటలు లేవడంతో సిబ్బంది వెంటనే గుర్తించి అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. అగ్నిమాపక శకటాలతో వేగంగా చేరుకున్న సిబ్బంది పది నిమిషాల్లోనే మంటలను ఆర్పివేశారు. ఏసీ మెషిన్ల నుంచి మంటలు వచ్చినట్లు అగ్నిమాపక విభాగం అధికారి తెలిపారు.

  • Loading...

More Telugu News